క్రీస్తు శిష్యుడైన మత్తయి చరిత్ర !
మత్తయి అను మాటకు "దేవుని వరము" అని అర్ధం. మొదట లేవి అని
పిలువబడ్డాడు. తరువాత మత్తయి గ పిలువబడ్డాడు. క్రీస్తు శిష్యులలో
యుదులచే బహుగా ద్వేషించబడిన సుంకపు పని చేసే మత్తయి.
శిష్యులకంటే విధ్యలోను, గణిత శాస్త్రములోను గొప్పవాడై యుండెను. అయన హెబ్రీ, అరమిక్, గ్రీకు, లాటిన్ భాషలు ఎరిగినవాడు.
అల్పయి కుమారుడగు మత్తయికు మరో పేరు లేవి. (మార్కు 2:14) ఈయన యాకోబు అనే శిష్యుని పెద్ద సహోదరుడు(మార్కు 3:18).
మత్తయి వృత్తి :-
క్రీస్తు జీవించిన కాలములో రోమా ప్రభుత్వము యూదులయొద్ద అనేక రీతులలో సుంకము వసూలు చేయుచుండెను. నేల మార్గము, సముద్ర మార్గము నుండి వచ్చు వస్తువులపై సుంకపు పన్నులు విధించేవారు. రోమా ప్రభుత్వమునకు చెల్లించవలసిన పైకమును చెల్లించిన తరువాత ఆయా ప్రాంతములలో సుంకపు గుత్తాదారులను
నియమించి పన్ను వసూలు చేయు బాధ్యత కొందరు వహించుచుండిరి. ఆ ప్రకారము కపేర్నహుములో సుంకములు వసూలు చేయువారిలో ఒకరు ఈ మత్తయి. వీరి ప్రజలయొద్ద వసూలు సొమ్ములో కొంత భాగమును తన రాబడిగా తీసుకొనేవారు. ధమస్కు నుండి అక్కో వేళ్ళు ప్రముఖ్య మైన వ్యాపారమార్గములో కపేర్నహోము ఉండెను గనుక మత్తయికు మంచి రాబడి ఉండెను. సుంకరులు రోమా ప్రభుత్వము తరుపున ఉద్యోగము చేసిన యూదులు గనుక మిగిలిన
యూదులు వారిని కులద్రోహులు అని ద్వేషించేవారు. సమాజ మందిరములలో వారికీ చోటియ్యారు. వారి కానుకలు అంగీకరించ బడవు. సుంకము చెల్లించు యుధులు వీరి యొద్ద నుండి మిగిలిన చిల్లర తీసుకొనుటకు అసహ్యముగాభావించిరి. మితిమీరి
పన్నులు వసూలు చేయుచున్నారు అని తలంచిరి గనుక వారిని మోసగాళ్ళు పాపులులుగా భావించారు.
యేసుని వెంబడించిన మత్తయి:-
మత్తయి సుంకము వసూలు చేయుటను తన వృత్తిగా తలంచి చేయుచుండెను. అయితే యూదుల ఆచారములను విడువలేదు. ఎంతో వివేకము, జ్ఞానము గల మత్తయి యూదుల గ్రంధములను విరివిగా చిదివినాడు. సువార్తలన్నింటిలోను ఈయన రాసిన సువర్తలోనే ఎక్కువుగా పాతనిభంధన వాక్యాలు ఎత్తి వ్రాయబడెను. గ్రంధములను
మాత్రమే గాక ప్రస్థుతకాల సంఘటనలను కూడా గ్రహించిన మత్తయి,
క్రీస్తుని గూర్చి కూడా వినియుండెను. అందునుబట్టి యేసు ఆయనను చూచి నన్ను వెంబడించు అనగా, అతడు లేచి ఆయనను వెంబడించెను.
శిష్యునిగా క్రీస్తును వెంబడించిన మత్తయి తన తలాంతును క్రీస్తు నామ
మహిమార్ధమై వాడెను. క్రీస్తు చెప్పిన వాటిని, చేసిన వాటిని వ్రాసి
పెట్టుకొనేను. తరువాత అది సువార్తగా మరెను. మత్తయి సువార్త మాత్రమే క్రీస్తు కొండపై చేసిన ప్రసంగము పూర్తిగా మనకు అందించుచున్నది. ఈయన తన
సువార్తలో తన్ను గూర్చి యేసు తనను పిలిచిన సంగటన తప్ప వేరే ఏదియు వ్రాయకుండుట తన ధీనత్వము తెల్పుచున్నది.
మత్తయి సువార్త:-
ప్రారంభ దినములో మత్తయి యూదుల మధ్య సేవచేసేను. గనుక తన
సువార్తను హెబ్రీ భాషలో వ్రాసేను. తరువాత అది గ్రీకు బాషలో తర్జుమా
చేయబడెను. రెండవ శతాబ్దపు క్రైస్తవ సాహిత్యములో మత్తయి సువార్త
భాగములు ఎక్కువగా ఎత్తి వ్రాయబడుట మిగిలిన మూడు సువర్తలకంటే
మత్తయి సువార్త ఘనత వహించేను. పాత నిబంధనలో క్రీస్తుకు సంబంధించిన ప్రవచనములను ఎత్తి చూపి, లోకమును రక్షించుటకు వచ్చిన మెస్సయ్యా క్రీస్తు అను సత్యమును నొక్కి రాసేను.
మత్తయి సేవ:-
అపోస్తులుడైన మత్తయి 15సంవత్సరాలు యూదుల మధ్య సేవ చేసెను. పిదప విదేశాలు వెళ్ళెను. విద్యావంతుడైన మత్తయి రాజులతోను, ప్రభుత్వ ప్రముఖులతోను సంభాషించి క్రీస్తును గూర్చి తెలుపు సమర్ధత గలవాడై యుండెను. పారసిక, ఇథియోపియ ప్రాంతంలలో సేవ చేసెను. అచ్చట నుండి హెబ్రీ బాషలో వ్రాసిన సువార్త పుస్తకము తొలిసారి మన దేశమునకు వచ్చెనని చెప్పబడుచున్నది. మత్తయి ఐగుప్తు దేశమును దర్శించెను. ఇథియోపియ వెళ్ళినపుడు సువార్తహికుడైన ఫిలిఫ్ఫ్ చేత బాప్తిస్మము పొందిన నపుంసకుని ఇంట బస చెసెను. (అపో. 8:27) ఆ సమయములో ఇద్దరు మంత్రికులు తమ మంత్ర శక్తిని బట్టి ఇథియోపియ దేశ ప్రజలందరినీ తమకు లోబరచుకొని యుండిరి. అయితే మత్తయి వారిని వెల్లగొట్టి ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించెను.
మృతి నొందిన ఐగుప్తు రాజు కుమారుని బ్రతికించినట్టు, కుష్టు రోగియైన
ఇబిజెనియా అను యువరాజును స్వస్థపర్చినట్టు చెప్పబడింది.
హతసాక్షి అయిన మత్తయి:-
మత్తయి ఇథియోపియలోను, ఇగుప్తులోను 23 సంవత్సరాల సేవ చేసెను. క్రీ. శ. 90లో తామిదియును ఎలుబడి యందు హత సాక్షిగా మరణించెను. ఈటె లేదా ఖడ్గముచే చంపబడి యుండవచ్చు అని నమ్ముచున్నారు.
అతనేషియన్ ఋషి ఈయన ఎముకలు కనుగొని ఇటలీ దేశమందున్న సలార్నో పట్టన అధిపతికి తెలిపెను. రాబర్ట్ కియస్ కార్డో అను అధిపతి పెద్ద దేవలయమును కట్టి దానిలో మత్తయి ఎముకలు బధ్రపరిచెను. నెడును

గుడ్
ReplyDelete