ఇశ్రాయేలుగా మారిన యాకోబు
లాబాను తన కుమర్తేలను ముద్దు పేట్టుకోని వారిని దీవించి యాకోబు నోద్ద నుండి తన ఉరికి వేళ్లిన తరువాత యాకోబు తన త్రోవను అనగా తండ్రి దేశమునకు వేళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కోనిరి యుకోబు వారినిచుసి ఇది దేవుని సేవ అని చెప్పి ఆ చోటికి మహను యిమ అను పెరు పేట్టెను (ఆదికాండము32:2)
అటు పిమ్మట యాకోబు తన అన్నయైన ఏశావును జ్ఞపకాము చేసుకోని అతడు తనమీద పగబట్టి యుండేననియు తనను చంపుననియు యాకోబు భయపడేను ఎందుకనగా తండ్రియైన ఇస్సాకు ఏశావును దీవించదలిచినప్పుడు యాకోబు తన తల్లియైన రిబ్కా ప్రెరేపణ వలన కపటోపాయం చేత ఆ దీవేనలను పోంది యుండేను కనుక యాకోబు ఏశావుతో సమధానపడుటకు తన దూతలను అనగా సేవకులను ముందుగా పంపేను ఆ దూతలు యాకోబు నోద్దకు తిరిగివచ్చి-మేము మి సహోదరుడైన ఏశావునోద్దకు వేళ్లితిమి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కోన వచ్చుచున్నాడని చెప్పెగా యాకోబు మిక్కిలి భయపడి తోందరపడేను (ఆదికాండము32:6-7)
ఇలా ఏశావు తన మిదకు వచ్చిన సమస్తమును హతము చేయనేమో అనుకోని యాకోబు తన జనములను రెండు గుంపులుగా విభజించి ఒక గుంపుతో ఏశావునకు కానుకలు ఇచ్చి అతని సమధానపరిచి అటని కటాక్షము పోందుటకై వారిని ముందుగా పంపివేసేను మిగిలిన రెండవ గుంపు ఆ రాత్రి యందు అక్కడనె నిలిచేను అటు పిమ్మట ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరి భార్యలను తన ఇద్దరి దాసిలను తన పదకోండు మంది పిల్లలను తీసుకోని యబ్భోకు రేవు దాటి పోయేను (ఆదికాండము32:22)
ఇలా యాకోబు తన యావదాస్ధిని తన భార్య పిల్లలను రెండో గుంపుగా పంపివేసి ఆ రాత్రి వేళ ఒక్కడిగానే మిగిలిపోయి తెల్లవారు వరకు ఒక నరునితో పోరాడినట్లుగా దేవునితో పోరాడేను అదేట్లనగా-నాతండ్రియైన అబ్రాహము దేవా నా తండ్రియైన ఇస్సాకు దేవా ని దేశమునకు నీ బంధువుల యెద్దకు తిరిగి వేళ్ళుము నీకు మేలు చెసెదనని నాతో చెప్పెన యేహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకరములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యి యేర్దాను దాటితిని ఇప్పుడు నేను రెండు గుంపులైతినీ నా సహోదరుడైన ఏశావు చెతి నుండి దయచెసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు -నేను నికు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తరముగుట వలన లేక్కింపలేని సముద్రపు ఇసుక వలే నీ సంతానము విస్తరింపజేయుదు నని సేలవిచ్చితివే అనేను (ఆదికాండము32;9-12)
అవును ఈ విదముగా యాకోబు దేవునితో పోరాడుచు పేనుగులాడుతూ వుండేను యాకోబు దేవునితో పోరాడి పేనుగులాడుటనగా పోట్లడుట కాదు ఆది శరిరక సంబందమైన పోరాటం అసలు కానేకాదు ఇక్కడ పోరాడుట అనగా బ్రతిమాలు కోనుట దేవుని పాదములు పట్టుకోని కన్నిరు కార్చి రోధించుట అవును అతడు దుతతో పోరాడి జయేమోందేను అతడు కన్నిరు విడిచి అతని బతిమాలేను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయేను అక్కడ అయన మనతో మాటలడేను (హోషయా12:4)
ఈ విదముగా ఒక తల్లి ఉద్యోగము నమిత్తమై ఇంటిలోనుండి బయలు దెరి వేళ్లుతు వుండగా చంటి పిల్ల వాడు తల్లి కాళ్ళ దగ్గర పడి కాళ్ళను పేనవేసుకోని అమ్మా అమ్మా అని ఎడుస్తుంటే ఆ తల్లి బాబు నాకు డ్యుటికి సమయమవుతు వున్నది నన్ను వెళ్ళనివ్వురా!అనగా ఆ చిన్నపిల్ల వాడు అమ్మా అమ్మా నీవు నాతోనే వుండిపో అమ్మా అని వచ్చిరాని మాటలతో ఏడుస్తు వుండగా ఆ తల్లి డ్యుటికి సమయమవుతున్నది గనుక కార్య విదికై వేళ్ళులని ఒకవైపు మరోవైపు కాళ్ళకడుపడి ఎడుస్తున్న కుమరుని చుస్తు వేళ్లలేక బాబు నన్ను విడిచిపేట్టరా నేను వేళ్ళలీ అని బ్రతిమలాడుతు వున్నట్ల వున్నది ఈ దృశ్యం
అవును యాకోబు కూడా ఒక చంటి పిల్లవాని వలే యేహోవా దేవుని సన్నిదిలో ముందుకు వేళ్ళుతే అన్న చంపుతాడేమోన్న భయముతోను వేనక్కి అనగా సాక్షి కుప్ప దాటి వేళ్ళితే మామతో చేసుకొన్న నిబంధన మేరుతానేమోనన్న భయముతోను రాత్రి రాత్రియందంతయు ఒక్కడిగా మిగిలిపోయి దేవునితో పేనుగులాడుతుండేను
అప్పడు దేవుడు యాకోబు యెక్క పట్టుదలను కన్నిటి ప్రార్ధనను చూచి తోడగూటి మీద అతనిని కోట్టేను అయినను యాకోబు అదేవిదముగా దేవునితో మగసిరి కలవాడై పోరడుతుండగా (హోషయా12:3) యేహోవా తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మని యాకోబుతో అనెను అప్పుడు యాకోబు నీవు నన్ను ఆశిర్వాదించితేనే గాని నిన్ను పోనియ్యననేను అప్పుడు యేహోవా నీవు దేవునితోను మనష్యులతోను పోరాడి గేలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను (ఆదికాండము32:28) మరంతే కాక దేవుడు అతనిని ఆశిర్వాదించేను (ఆదికాండము32:29)

Leave a Comment