నీవు కలవరము లో ఉన్నావా? నీ జీవితములో ఒక ఉద్దేశ్యమును కనుగొన లేని స్థితిలో ఉన్నావా?

నీవు ఆకలిగొనియున్నావా? శరీరానుసారమైనది ఆకలి కాదు.
అ౦తకంటే నీ జీవితంలో ఎక్కువగా దేనికొరకైనా ఆకలి
గొనియున్నావా? నీ అంతరంగంలో తృప్తిపరచబడనిది ఏదైనా
వున్నదా? అలాగైతే యేసే మార్గము. యేసు చెప్పెను
“జీవాహారమును నేనే; నా యొద్దకు వచ్చువాడు
ఏమాత్రమును ఆకలిగొనడు, మరియు నా యందు
విశ్వాసముంచువాడు దప్పిక గొనడు” (యోహాను 6:35)
నీవు కలవరము లో ఉన్నావా? నీ జీవితములో  ఒక
ఉద్దేశ్యమును కనుగొన లేని స్థితిలో ఉన్నావా? ఎవరో లైటు
ఆర్పివేయగా నీవు స్విచ్ కనుక్కోలేనట్లు వున్నదా? అలాగైతే,
యేసే మార్గము: నేను లోకమునకు వెలుగును, నన్ను
అనుసరి౦చు వీడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి
యుండును అని యేసు ప్రకటించెను (యోహాను 8:12)
నీ జీవితంలో నీవు బంధింపబడినావని ఎప్పుడైనా
అనిపించినదా? శూన్యము, అర్థ రహితమైన వాటినే
కనుగొనుటకు, చాలా ద్వారములు తెరువ ప్రయత్నించావా ?
సంపూర్తి చేయబడిన జీవితములో ప్రవేశించుటకు
చూస్తున్నావా? అలాగయినచో యేసే మార్గము: “నేనే
ద్వారమును, నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశి౦చిన ఎడల వాడు
రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు, బయటకి వచ్చుచు మేత
మేయుచుండును (యోహా 10:19)
ఇతరులు నిన్ను ఎప్పుడూ చిన్న చూపు చూస్తున్నారా!
నీ సంబంధ బా౦ధవ్యాలు శూన్యముగాను ఖాళీగానున్నవా?
ప్రతివారు నిన్నుబట్టి లాభ౦ పొందాలని
ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుందా! అయినచో యేసే
మార్గము. “నేను గొర్రెలకు కాపరిని; మంచి కాపరి గొర్రెలను
ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును” అని యేసు
చెప్పెను (యోహా: 10:11, 14)
ఈ జీవితం తరువాత ఏమగునోనని ఆశ్చర్యపోతున్నావా? పనికి
రాని, తుప్పుపట్టిన జీవితం విషమై విసిగి పోయావా! అసలు ఈ
జీవితమునకు ఏదైనా అర్ధముందా? అని సందేహపడినావా?
నీవు చనిపోయిన తరువాత కూడా జీవించాలనుకుంటున్నావా?
అలా అయితే యేసే మార్గము; పునరుద్ధానమును,
జీవమును నేనే; నా యందు విశ్వాసముంచువాడు
చనిపోయిననూ బ్రతుకును; బ్రతికి నా యందు
విశ్వాసముంచు ప్రతివాడును ఎప్పటికినీ మరణి౦చడు.


No comments

Powered by Blogger.