ఇతరులు నిన్ను ఎప్పుడూ చిన్న చూపు చూస్తున్నారా??
నీ సంబంధ బా౦ధవ్యాలు శూన్యముగాను ఖాళీగానున్నవా?
ప్రతివారు నిన్నుబట్టి లాభ౦ పొందాలని
ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుందా! అయినచో యేసే
మార్గము. “నేను గొర్రెలకు కాపరిని; మంచి కాపరి గొర్రెలను
ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును” అని యేసు
చెప్పెను (యోహా: 10:11, 14)
ఈ జీవితం తరువాత ఏమగునోనని ఆశ్చర్యపోతున్నావా?
నీవు చనిపోయిన తరువాత కూడా జీవించాలనుకుంటున్నావా?
అలా అయితే యేసే మార్గము; పునరుద్ధానమును,
జీవమును నేనే; నా యందు విశ్వాసముంచువాడు
చనిపోయిననూ బ్రతుకును;
గ్రహించలేకపోవుటకు కారణము- నీవు దేవుని నుండి వేరు
చేయబడుటయే! మనమందరము పాపము చేసినందున
దేవుని నుండి వేరు చేయబడ్డామని బైబిలే సెలవిస్తున్నది
(ప్రసంగి 20, రోమా 3 23). నీ హృదయమందు
శూన్యము కనిపించుటకు గల కారణము నీ జీవితంలో
దేవునితో సంబంధము లేనందువల్లనే మన పాపము
వల్ల ఆ సంబంధము నుండి మనము వేరు
పర్చబడినాము. ఇ౦కా ఘోరమైనదేమంటే మన పాపము మనలను
దేవుని నుండి ఈ జీవితములోనికి రాబోవు జీవితము నుండి
నిత్యము వేరుచేస్తూ ఉ౦డడమే! (రోమా 6 23, యోహా 3:36)
ఈ సమస్య ఎలా పరిష్కరింపబడగలదు. యేసే మార్గము!
యేసు మనపాపములను తనపైన వేసుకొనెను (2 కొరి 5 :21)
మనము పొందవలసిన శిక్షను ఆయన తీసుకుని, మన
స్థానములో యేసు చనిపోయెను. (రోమా 5:8). మూడు
దినముల తరువాత యేసు మరణము నుండి లేచి, పాపము
మీద, మరణము మీద ఆయన జయమును రుజువు చేసెను
(రోమా 6: 45) ఎందుకు ఆయన అది చేసెను. “తన స్నేహితుల
కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన
ప్రేమగలవాడెవడును లేడు” అని ఆ ప్రశ్నకు యేసే
సమాధానము చెప్పెను. ( యోహాను 15: 13) మనము
జీవించునట్లుగా యేసు చనిపోయెను. మన విశ్వాసమును
యేసు నందు ఉంచినట్లైతే, ఆయన మరణము మన
పాపములకు పరిహారముగా చెల్లించాడని నమ్మినట్లైతే- మన
పాపములన్నియు క్షమించబడి, కడిగిగివేయబడినట్లే.
తిరిగి, వెలుగు వచ్చును. సంపూర్తిచేయబడిన జీవితములోనికి
మనకు మార్గముండును. మన మంచి కాపరిని,
నిజస్నేహితుని కనుగొనగలము. మనము మరణించిన
తరువాత జీవముందని గ్రహించగలము- పునరుద్ధాన
జీవితము, పరలోకమందు యేసులో నిత్య జీవము.

Leave a Comment